విజయనగరం: రాష్ట్రంలో అసలైన ప్రతిపక్ష పార్టీ తమదేనని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ అన్నారు. విజయనగరం జిల్లాలోని మంత్రి బొత్స సత్యనారాయణ ఇలాకాలో ఆయన గురువారం ఓదార్పు యాత్ర నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ కాంగ్రెసు పార్టీతో కుమ్మక్కయి ప్రతిపక్ష పాత్రను విస్మరించిందని, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష పాత్ర పోషించడంలో విఫలమయ్యారని ఆయన అన్నారు. తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు 46 మంది శాసనసభ్యులున్నా ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించారని, ఇప్పుడు 90 మంది సభ్యులున్నా అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించడం లేదని ఆయన అన్నారు.
ప్రభుత్వం ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని, ప్రభుత్వ తీరు సిగ్గుమాలినదిగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఉద్యోగులకు జీతాలు, పింఛన్లు తప్ప ఏమీ చెల్లించకూడదని ట్రెజరీలకు ఆదేశాలు వెళ్లాయని ఆయన చెప్పారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం గాలికి వదిలేసిందని ఆయన అన్నారు. పారిశుధ్య కార్మికులు, 104 సేవల ఉద్యోగులు, గ్రామ సేవకులు తనకు వినపతి పత్రాలు ఇస్తున్నారని ఆయన చెప్పారు. ధాన్యానికి మద్దతు ధర ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉందని ఆయన అన్నారు. ప్రభుత్వాన్ని ప్రజలు బంగాళాఖాతంలో కలుపుతారని ఆయన అన్నారు.
YSR Congress party president YS Jagan said that his party is playing real opposition role. He criticised that TDP president Chanadrababu Naidu colluded with Congress.
Story first published: Thursday, May 26, 2011, 18:13 [IST]