టిఆర్ఎస్‌ను తరిమి కొడదాం: మహానాడులో ఎర్రబెల్లి దయాకరరావు

Errabelli Dayakar Rao
హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఇక్కడ తెలంగాణ ప్రజలను రెచ్చగొడుతున్న తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయడం లేదని తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకరరావు మహానాడులో మాట్లాడుతూ ధ్వజమెత్తారు. కాంగ్రెసును ఇచ్చేది తెచ్చేది మేమే అంటున్నా కాంగ్రెసును కెసిఆర్ ఎందుకు ప్రశ్నించడం లేదని ఆయన అడిగారు. తెలంగాణ కోసం పార్లమెంటులో నోరు విప్పని కెసిఆర్ ఇక్కడికి వచ్చి మాత్రం ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తారని ఆరోపించారు. నాగం జనార్దన్ రెడ్డి పార్టీని, తెలంగాణ టిడిపి ప్రజాప్రతినిధులను ఆగమాగం చేయాలని నిశ్చయించుకున్నాడని అయితే చివరకు ఆయన ఆగం అయ్యాడని అన్నారు. చంద్రబాబునాయుడు ఎప్పుడు కూడా తెలంగాణ కోసం ఉద్యమం చేయవద్దని చెప్పలేదన్నారు. నాగం నోరు మూసుకుంటే మంచిందన్నారు. అందరం కలిసి పోరాడుదామంటే రావడానికి సిద్ధమని, కానీ తమ పార్టీని కించపరిస్తే మాత్రం ఊరుకునేది లేదన్నారు.

పోచారం శ్రీనివాస్ రెడ్డి పార్టీని, పార్టీ అధినేతను ఒక్క మాటైనా అనకుండా పార్టీని వీడి వెళ్లారని అలా వెళ్లకుండా నాగం విరుద్దంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. టిడిపి పేదల పార్టీ అని ఈ పార్టీని ఇరు ప్రాంతాల్లో బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి తెలంగాణ ప్రాంతాన్ని పూర్తిగా నాశనం చేశాడని ఆ సమయంలో కాంగ్రెసుతో పొత్తు పెట్టుకున్న టిఆర్ఎస్ నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించిందన్నారు. వైయస్ తెలంగాణ భూములను అల్లుడికి ధారాదత్తం చేస్తున్నప్పుడు కెసిఆర్‌కు తెలంగాణ గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. పార్టీ జెండాతోనే తెలంగాణ కోసం పోరాటం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. కుటుంబ పాలన సాగిస్తున్న టిఆర్ఎస్‌ను తరిమి కొడదామని పార్టీ నేతలకు పిలుపు నిచ్చారు.

అంతకుముందు యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ రెండు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టిన వైయస్, కాంగ్రెసులకు తెలంగాణపై స్పష్టత లేదన్నారు. తెలంగాణపై టిడిపి ఇప్పటికే పలు వేదిలకలపై స్పష్టత ఇచ్చిందని చెప్పారు. పార్టీలో యువతకు పెద్ద పీట వేయాలని ఆయన చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. విపక్షాలు అన్ని రాష్ట్రంలో టిడిపి లేకుండా నాశనం చేయాలని చూస్తున్నాయని, అయితే టిడిపి లేకుండా చేయడం ఎవరి తరం కాదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+