2నెలల్లో చంచల్‌గూడ జైలుకు జగన్: దేవినేని ఉమ సంచలన వ్యాఖ్యలు

కడప ఉప ఎన్నికల్లో రూ.500 కోట్లు అడ్డం పెట్టుకొని తల్లీ, కొడుకులు గెలిచారని ఆన్నారు. ఓదార్పు యాత్ర పేరుతో కోట్లు గుమ్మరించి ప్రజలను మాయ చేసి తన వశం చేసుకోవాలని జగన్ చూస్తున్నాడని కానీ ఎన్ని మాయ మాటలు చెప్పినా జగన్ మాటలు ప్రజలు నమ్మరన్నారు. రైతుల గురించి మాట్లాడే హక్కు కేవలం తెలుగుదేశం పార్టీకే ఉందన్నారు. జగన్‌కు లేదన్నారు. అవిశ్వాసం పెట్టమని నిత్యం టిడిపిని ప్రశ్నించే జగన్ చంద్రబాబు సవాల్ విసిరే వరకు తమ వద్ద ఎమ్మెల్యేలు లేరంటూ కొత్తరాగం అందుకొని వెనక్కి తగ్గారన్నారు. తనతో ఉన్న ఎమ్మెల్యేలపై జగన్‌కే పూర్తి నమ్మకం లేదని అన్నారు.