బెయిలు కోసం సుప్రీం కోర్టుకు చిరంజీవి అల్లుడు శిరీష్ భరద్వాజ్

కాగా కుటుంబం అనుమతి లేకుండా చిరంజీవి చిన్న కూతురు శ్రీజ శిరీష్ భరద్వాజ్‌ను పెళ్లి చేసుకున్నది. అయితే ఇటీవల శ్రీజను శిరీష్ అతని తల్లిదండ్రులు వరకట్న వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ హైదరాబాదులోని సిసిఎస్ పోలీసు స్టేషన్‌లో శ్రీజ కుటుంబ సభ్యులు కేసు పెట్టారు. తనను శ్రీజతో ఓసారి మాట్లాడించాలని, శ్రీజను బ్రెయిన్ వాష్ చేసి తన వద్ద నుండి దూరం చేశారని శిరీష్ చెప్పుకొచ్చాడు. అయితే అందుకు అవకాశం లేక పోవడంతో తనను అరెస్టు చేసే అవకాశమున్నందున శిరీష్ ముందస్తు బెయిలుకు దరఖాస్తు చేసుకున్నాడు. దానిని హైకోర్టు తిరస్కరించడంతో భరద్వాజ్ సుప్రీం కోర్టును ఆశ్రయించాడు.