జూపల్లి కృష్ణా రావు పాదయాత్రకు కాంగ్రెసు తెలంగాణ ఎంపిల మద్దతు

డికె అరుణ వ్యతిరేకతతో జూపల్లి కృష్ణా రావు తన పాదయాత్రను నాలుగు రోజుల పాటు వాయిదా వేసుకున్నారు. వచ్చే నెల 1వ తేదీ నుంచి ఆయన తన పాదయాత్రను గద్వాలలో చేపట్టాలని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యుల మద్దతును ఆయన కూడగట్టుకుంటున్నారు. జూపల్లి కృష్ణా రావుకు కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యులు సమర్థిస్తున్నారు. కాంగ్రెసు విధానం మేరకే జూపల్లి కృష్ణా రావు పాదయాత్ర జరుగుతోందని మందా జగన్నాథం అన్నారు. జూపల్లి పాదయాత్ర కొనసాగింపునకు అవసరమైతే తాము డికె అరుణతో మాట్లాడుతామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications