తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబు సవాల్‌ను స్వీకరించిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి

By Pratap
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
తిరుపతి: అవిశ్వాస తీర్మానం ప్రతిపాదనపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు విసిరిన సవాల్‌ను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్వీకరించారు. అవిశ్వాసాన్ని ఎదుర్కోవడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ''అవిశ్వాసం పెట్టాల్సింది అసెంబ్లీలో. పెట్టమనండి చూద్దాం. వారి బలం వారికుంటే.. మా బలం మాకుంది. మా ప్రభుత్వం ఎలాంటి సవాలునైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది'' అని ఆయన ఆదివారం కలికిరిలో మీడియా ప్రతినిధులతో అన్నారు. చంద్రబాబు పట్ల జాలి పడుతున్నానని, ఆయన గురించి అంతకు మించి ఏమీ మాట్లాడనని ఓ ప్రశ్నకు బదులిచ్చారు.

జగన్‌ వెంట వెళుతున్నవారిపై వేటు గురించి అడగ్గా.. 'అవసరమైనప్పుడు చర్యలు తీసుకుంటాం' అని బదులిచ్చారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలేవీ ఆగవని కిరణ్‌ స్పష్టం చేశారు. గతంలో కంటే సంక్షేమ పథకాలను పెంచామని, అవినీతిని అరికట్టేందుకు పటిష్ఠ చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. 2014లో కూడా కాంగ్రెస్సే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు.

ధాన్యం కొనుగోలులో రైతులకు ఇబ్బందులు ఉన్నమాట వాస్తవమేనని కిరణ్‌ చెప్పారు. ఈ ఏడాది 32 శాతం దిగుబడి అదనంగా రావడంతో నిల్వ చేయడానికి అవసరమైన గోదాములు లేక సమస్య తలెత్తిందన్నారు. చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా ఆదివారం ఆయన తిరుపతిలో విలేకర్లతో మాట్లాడారు. శ్రీవారి దర్శనార్థం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆదివారం రాత్రి తిరుమల చేరుకున్నారు. తిరుమలలో ముఖ్యమంత్రికి దేవస్థానం సాధికార మండలి ఛైర్మన్‌ జె.సత్యనారాయణ, ఈవో ఐవైఆర్‌ కృష్ణారావులు స్వాగతం పలికారు. తితిదే కార్యక్రమాలపై సీఎం అధికారులతో చర్చించారు.

తిరుమల శ్రీవారికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆదివారం రాత్రి తలనీలాలు సమర్పించుకున్నారు. మొక్కు చెల్లింపులో భాగంగా సీఎం బస చేసిన శ్రీపద్మావతి అతిథి గృహానికి క్షురకుని పిలిపించుకుని తలనీలాలు సమర్పించారు.

English summary
CM Kiran Kumar Reddy said that he is ready to face no confidence motion if TDP president N Chandrababu Naidu proposes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X