చంద్రబాబుపై దుమ్మెత్తిపోసిన లక్ష్మీపార్వతి, అమావాస్య చంద్రుడని వ్యాఖ్య

మాజీ ప్రధాని వాజ్‌పేయి వల్లనే చంద్రబాబు 1999 ఎన్నికల్లో గెలిచారని ఆమె అభిప్రాయపడ్డారు. ఆ తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లోనూ ఓటమి పాలయ్యారని ఆమె చెప్పారు. స్వర్గీయ ఎన్టీ రామారావు మృతికి చంద్రబాబే కారణమని ఆమె అన్నారు. చంద్రబాబుపై నమ్మకం లేక పార్టీ ఖాళీ అవుతోందని ఆమె అన్నారు. చంద్రబాబు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని లక్ష్మీపార్వతి దుయ్యబట్టారు. చంద్రబాబు వెన్నుపోటు వల్లనే ఎన్టీ రామరావు మనస్తాపానికి గురై మరణించారని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications