సత్యసాయి ట్రస్టు అత్యవసర సమావేశం: యజుర్ మందిరంపై చర్చ!

Sathya Sai Baba
అనంతపురం: యజుర్వేద మందిరం తెరుస్తారనే కథనాలు రావడంతో దానిని తెరిచే విషయంలో శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్టు సభ్యులు అత్యవసర సమావేశం అయ్యారు. పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలోని శాంతి భవన్‌లో సత్యసాయిబాబా సోదరుడి తనయుడు రత్నాకర్, శ్రీనివాసన్, ఎస్వీ గిరి, చక్రవర్తి మంగళ వారం ఉదయం భేటీ అయ్యారు. యజుర్వేద మందిరం తెరిచే విషయంపై వారు రహస్యంగా చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. యజుర్వేద మందిరాన్ని ఎప్పుడు తెరవాలనే విషయంపై చర్చించి నిర్ణయించుకొని ప్రభుత్వానికి తెలపాలనే ఉద్దేశ్యంతో వారు ఉన్నట్లుగా తెలుస్తోంది.

సోమవారం ఉదయం యజర్వేద మందిరం తెరుస్తున్నట్లు కథనాలు వచ్చాయి. ఆ మందిరంలోని సత్యసాయి సెంట్రల్ ట్రస్టుకు చెందిన లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. ఆ మందిరాన్ని తెలిస్తే సత్యసాయి ఆస్తులు దాదాపు పూర్తిగా బయట పడతాయని తెలుస్తోంది. పోలీసు భద్రత మధ్య సోమవారం ఆ మందిరాన్ని తెరుస్తారని వార్తలు వచ్చినప్పటికీ ఆ తర్వాత తెరవక పోవడంతో దానిని ఎప్పుడు తెరుస్తారా అని అందరూ ఎదురు చూస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+