హైదరాబాదులో సుష్మా స్వరాజ్‌కు అవమానం, బిజెపి నేతల ఆగ్రహం

ప్రతిపక్ష నేత అయిన సుష్మా స్వరాజ్‌కు కేబినెట్ హోదా ఉంది. ఆమె పర్యటన వివరాలు ఢిల్లీ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి అందాల్సి ఉంటుంది. ఆ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఆమెకు అన్ని సౌకర్యాలు కల్పించాల్సి ఉంటుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆమె పర్యటనను లెక్కలోకి కూడా తీసుకున్నట్లు లేదు. సుష్మా స్వరాజ్ విమానాశ్రయం నుంచి బిజెపి రాష్ట్రాధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి వాహనంలోనే లేక్‌వ్యూ అతిథి గృహానికి చేరుకున్నారు. మధ్యలో ట్రాఫిక్ జామ్ అయినా పట్టించుకున్నవారు లేరు. సుష్మా స్వరాజ్‌కు కనీస భద్రతను కూడా అధికారులు కల్పించలేదు.












Click it and Unblock the Notifications