రామ్‌దేవ్ బాబాకు రెడ్ కార్పెట్: స్వాగతం పలికిన కేంద్రమంత్రులు

ఈ సందర్భంగా వారు దీక్షను విరమించుకోవాల్సిందిగా వారు విజ్ఞప్తి చేసినట్టుగా తెలుస్తోంది. అయితే బాబా దానికి తిరస్కరించారని సమాచారం. దీక్ష తదితర విషయాలపై చర్చించేందుకు రామ్‌దేవ్ ప్రణబ్‌తో భేటీ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం మీ డిమాండ్లను పరిష్కరించే మార్గంలోనే యోచిస్తుందని ప్రణబ్ చెప్పి దీక్షను విరమింప జేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే స్వయంగా ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ సైతం బాబాకు దీక్ష విరమించాలని లేఖ రాశారు. కాగా పిఎంవో బాబాతో చర్చలకు దూరంగా ఉంది. ఇప్పటికే అన్నాహజారే దీక్షతో కంపించిన కేంద్రం రామ్‌దేవ్ బాబా దీక్ష చేస్తే తమ పరువు మరింత పోతుందనే బాబాకు రెడ్ కార్పెట్ పరిచి దీక్ష విరమింప జేసే ప్రయత్నాలు చేస్తోంది.












Click it and Unblock the Notifications