తెలంగాణపై స్పష్టమైన ప్రణాళిక ఉందా: జూపల్లిని ప్రశ్నించిన డికె అరుణ
Districts
oi-Srinivas G
By Srinivas
|
హైదరాబాద్: జూపల్లి కృష్ణారావు పాదయాత్రను తాను ఎప్పుడూ ఆడ్డుకోలేదని మంత్రి డికె అరుణ బుధవారం విలేకరులతో మాట్లాడుతూ అన్నారు. తెలంగాణ కోసం జూపల్లి చేస్తున్న పాదయాత్రను అడ్డుకుంటానని తాను ఎప్పుడూ చెప్పలేదని, తాను అడ్డుకోలేదన్నారు. జూపల్లి పార్టీ ప్రయోజనాల కోసం కాకుండా వ్యక్తిగత ప్రణాళికతో ముందుకు వెళుతున్నారని అందుకే తాను ఆయన పాదయాత్రను ప్రశ్నిస్తున్నానని అన్నారు. ఆయన తన మంత్రి పదవికి చేసిన రాజీనామాపై స్పందించనన్నారు. తాను పార్టీ ప్రయోజనాల కోసం వ్యక్తిగతంగా కాకుండా అందరితో కలిసి నిర్ణయం తీసుకుంటానని అన్నారు.
ఆయన స్వప్రయోజనాల కొరకు చేస్తున్నందువల్లనే పలువురు అడ్డుకునే ప్రయత్నాలు చేశారన్నారు. తెలంగాణ కోసం ఆయనకు ఓ ప్రణాళిక ఉందా అన్నారు. కాగా కాంగ్రెసు సీనియర్ నాయకుడు కె కేశవరావుతో డికె అరుణ, ఎంపీ వివేక్, మల్లు రవిలు భేటీ అయ్యారు. మహబూబ్‌నగర్ జిల్లాలో పార్టీ పరిస్థితులు, జూపల్లి రాజీనామా తదితర అంశాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది.