జూలైలోగా తెలంగాణ ఇవ్వాల్సింగదే, అధిష్టానానికి ఆఖరి డెడ్‌లైన్: కెకె

ఈ నెల 5న తేదిన పార్టీ విస్తృతస్థాయి సమావేశం ఉంటుందని ఆ తర్వాత 6న అందరం కలిసి ఢిల్లీకి వెళతామని చెప్పారు. ఢిల్లీ వెళ్లి ప్రధానిని, పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీని కలుస్తామని చెప్పారు. తెలంగాణకు చెందిన కాంగ్రెసు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ తెలంగాణకు కట్టుబడి ఉన్నారన్నారు. తెలంగాణలో కాంగ్రెసు పార్టీ రక్షణ కోసం ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాల్సిందే అన్నారు. మాలో ఎలాంటి విభేదాలు లేవని మీడియానే దానిని కొండంత చేసి చూపిస్తుందన్నారు. జూన్ నెల చివర వరకు కేంద్రం తెలంగాణ ప్రకటించకుంటే మా నిర్ణయం ఎవరూ ఊహించని స్థితిలో ఉంటుందని అన్నారు. జూలైలో తెలంగాణ రాకుంటే దీక్షకు దిగేందుకు సిద్ధమని చెప్పారు. అప్పటికీ కేంద్రం స్పందించకుంటే రాజీనామాలు చేస్తామని అన్నారు.












Click it and Unblock the Notifications