వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రజనీకాంత్‌కు మూత్రపిండాల మార్పిడి జరగలేదు: ధనుష్ వెల్లడి

రజనీకాంత్ ఆరోగ్యంపై చెలరేగుతున్న ఊహాగానాలను నమ్మవద్దని ఆయన అభిమానులను కోరారు. రజనీకాంత్‌కు మూత్రపిండాల మార్పిడి జరగలేదని, త్వరలోనే రజనీకాంత్ స్వయంగా ఓ ప్రకటన చేస్తారని ఆయన చెప్పారు. రజనీకాంత్ మరో వారం రోజుల పాటు సింగపూర్‌లోనే ఉండాలని కోరుకుంటున్నామని, దానివల్ల రజనీకి పూర్తి విశ్రాంతి లభిస్తుందని ఆయన అన్నారు. రజనీ మామూలుగా ఆహారం తీసుకుంటున్నారని, వాకింగ్ చేస్తున్నారని, సినిమాలు చూస్తున్నారని, మాట్లాడుతున్నారని ఆయన వివరించారు.