హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణను మోసం చేసి విమర్శిస్తారా: సుష్మాపై ఎంపీ పొన్నం ఫైర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Ponnam Prabhakar
హైదరాబాద్: కాకినాడలో ఒక వోటు రెండు రాష్ట్రాలు అంటూ అధికారంలోకి వచ్చి ఆ తర్వాత అధికారంలో రెండు పర్యాయాలు ఉండి కూడా తెలంగాణ ఇవ్వకుండా మోసం చేసింది భారతీయ జనతా పార్టీ అని అలాంటిది ఇప్పుడు తమపై ఆ పార్టీ నేత సుష్మాస్వరాజ్ కరీంనగర్ వచ్చి కాంగ్రెసును, పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీని విమర్శించడం సరికాదని పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ అన్నారు. బుధవారం ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ ఇంట్లో తెలంగాణ ఎంపీలు సమావేశం అయ్యారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా పొన్నం బిజెపి, సుష్మాస్వరాజ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. 125 ఏళ్ల కాంగ్రెసుకు ఏం నిర్ణయం తీసుకోవాలో తెలుసని తమకు బిజెపి చెప్పాల్సిన అవసరం లేదన్నారు.

సుష్మాస్వరాజ్ తమ పార్టీపై, సోనియాపై అవాస్తవ ఆరోపణలు చేశారన్నారు. బిజెపి కాంగ్రెసు పార్టీని విమర్శించడమే పనిగా పెట్టుకున్నందున సీమాంధ్రకు చెందిన కాంగ్రెసు ప్రజా ప్రతినిధులు కూడా ఆలోచించాలని సూచించారు. కేంద్రం ఇచ్చిన మాటను నిలబెట్టుకునే విధంగా సీమాంధ్రులు మద్దతు పలకాలన్నారు. వారు బిజెపి కుయుక్తులు అర్థం చేసుకోవాలని హితవు పలికారు. ఇరు ప్రాంతాల్లో కాంగ్రెసును రక్షించుకునేందుకు తెలంగాణ అత్యంత ఆవశ్యం అన్నారు. కాంగ్రెసు తెలంగాణ ఇచ్చి గౌరవాన్ని పెంపొందించుకుంటుందని అన్నారు.

మరో ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ తాము పదవులలో ఉన్నది తెలంగాణ సాధించడానికే అన్నారు. రాజీనామాలు చేస్తే తెలంగాణ వస్తుందంటే ఎప్పుడో చేసే వాళ్లం అన్నారు. అవసరమైతే రాజీనామాకే కాదు ఎలాంటి త్యాగానికైనా సిద్ధమని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెసు నాయకుల్లో ఎలాంటి విభేదాలు లేవన్నారు. తెలంగాణ విషయంలో రాజీపడే ప్రసక్తి లేదన్నారు. ఈ నెలాఖరు వరకు అధిష్టానానికి అవకాశం ఇచ్చి ఆ తర్వాత తెలంగాణపై ఉద్యమిస్తామని అన్నారు. తెలంగాణ కోసం ప్రత్యేక జెండాను తయారు చేసినట్టు మరో ఎంపి వివేక్ చెప్పారు.

English summary
MP Ponnam Prabhakar blamed Sushma Swaraj for accusing AICC president Sonia Gandhi in Karimnagar meeting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X