ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధం: వైయస్ జగన్
State
oi-Pratapreddy
By Pratap
|
హైదరాబాద్: ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. పార్టీ సమావేశం బుధవారం రెండో రోజు కూడా సాగింది. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆయన కోరారు. రైతు సమస్యలపై ఈ నెల 13వ తేదీన జిల్లా కలెక్టరేట్ల ముట్టడి చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. తమ పార్టీ ఇప్పటి నుంచి క్రియాశీలక రాజకీయాల్లోకి వస్తున్నట్లు ఆయన తెలిపారు.
పార్టీని గ్రామస్థాయి నుంచి పటిష్ట పరచడానికి ఇదే తగిన సమయమని ఆయన చెప్పారు. పార్టీ నాయకులపై తనకు నమ్మకం ఉందని ఆయన చెప్పారు. నమ్మకంగా పనిచేయాలని ఆయన నాయకులకు పిలుపునిచ్చారు. సభ్యత్వ నమోదుపై, రైతు సమస్యలపై సమావేశంలో చర్చించారు.