రామ్‌దేవ్ బాబా దీక్షలో పాల్గొంటా: మద్దతు ప్రకటించిన అన్నాహజారే

కాగా రామ్‌దేవ్ బాబా దీక్షకు ఢిల్లీ ప్రభుత్వం ఏర్పాట్లు ప్రారంభించింది. బుధవారం ఢిల్లీ విమానాశ్రయంలో బాబాతో కేంద్రమంత్రులు ఓమారు చర్చలు జరిపారు. వాటిపై బాబా సంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ నల్లధనం, అవినీతిపై దీక్షను విరమించేది లేదని ప్రకటించారు. దీంతో కేంద్రం మరోమారు బాబాతో చర్చలు జరిపేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే అన్నాహజారే దీక్షతో పరువు గంగలో కలిసిందని ఇక బాబా దీక్ష చేస్తే తమ పరిస్థితి అగమ్యగోచరంగా తయారవుతుందని కేంద్రం భావిస్తుంది. అందుకే ఆయన దీక్షను విరమింపచేయడానికి ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మంత్రులతో అత్యసవసర సమావేశం కానున్నారు. బుధవారం సాయంత్రం 4.30 గంటలకు కోర్ కమిటీ సమావేశం కానుంది. కాగా ప్రభుత్వ ఒత్తిళ్లకు తలొగ్గకుండా బాబా దీక్షలో పాల్గొనేందుకు భారీగా కార్యకర్తలు ఢిల్లీ చేరుకుంటున్నారు. రామ్‌దేవ్ బాబా పక్కా బిజినెస్ మాన్ అంటూ దిగ్విజయ్ సింగ్ ధ్వజమెత్తారు.












Click it and Unblock the Notifications