కాంగ్రెసు కార్యకర్త అత్యాచార యత్నం: పిఎస్ ఎదుట బంధువుల ఆందోళన
Districts
oi-Srinivas G
By Srinivas
నిజామాబాద్: కాంగ్రెసు పార్టీకి చెందిన ఓ కార్యకర్త యువతిపై అత్యాచార యత్నం చేసిన సంఘటన నిజామాబాద్ జిల్లాలోని నాగారం గ్రామంలో గురువారం చోటు చేసినట్టుగా సమాచారం. స్థానిక కాంగ్రెసు పార్టీ కార్యకర్త అన్వర్ ఓ యువతిపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. యువతిపై అన్వర్ అత్యాచార యత్నాన్ని నిరసిస్తూ పలు మహిళా సంఘాలు, నాగారం గ్రామస్తులు, యువతి బంధువులు ఐదవ టౌన్ పోలీసు స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు.
అత్యాచార యత్నానికి పాల్పడ్డ అన్వర్‌ను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. అన్వర్‌పై అరెస్టు చేసి కేసు పెట్టే వరకు ఆందోళన విరమించేది లేదని పోలీసులను హెచ్చరించారు.