వైయస్ జగన్ పర్యటన వాయిదా, అవిశ్వాసంపై వ్యూహరచనలో బిజీ

చంద్రబాబు అవిశ్వాసానికి సై అనడంతో ఇప్పుడు అందరి దృష్టి జగన్ వర్గం శాసన సభ్యులపై పడింది. అవిశ్వాసానికి కాంగ్రెసు పార్టీలోని ఎమ్మెల్యేలు తమతో ఎంతమంది కలిసి వస్తారనే విషయంపై జగన్ ముఖ్య నేతలు, శాసనసభ్యులతో గురువారం సాయంత్రం 5 గంటలకు సమావేశం కానున్నారని కూడా తెలుస్తోంది. తమతో కలిసి వచ్చే ఎమ్మెల్యేలు ఎందరు ఉంటారు, వచ్చిన వారిపై తదనంతర పరిణామాలపై చర్చించేందుకు జగన్ ఈ భేటీ ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. జగన్ చేసిన పలు దీక్షల్లో కాంగ్రెసు నుండి సుమారు 25 నుండి 30 మంది ఎమ్మెల్యేల వరకు అప్పుడప్పుడూ పాల్గొంటూ వచ్చారు. అయితే కాంగ్రెసు విప్ జారీ చేస్తే కనీసం పది మంది అయినా వచ్చే అవకాశం ఉందా విషయంపై ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది.
కాంగ్రెసు ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం నెగ్గడానికి టిడిపితో అన్ని విపక్షాలు కలిసి రావడంతో పాటు మరో 38 మంది వరకు ఎమ్మెల్యేలు అవసరం. అయితే పార్టీ విప్ దృష్ట్యా కాంగ్రెసు నుండి జగన్‌కు మద్దతుగా అవిశ్వాసాన్ని అంతమంది బలపరిచే అవకాశం లేదనేది పలువురు వాదన. కాంగ్రెసు 156 మంది ఎమ్మెల్యేలను కలిగి ఉండటమే కాకుండా 18 మంది ఎమ్మెల్యేలు కలిగిన పిఆర్పీ, 7గురు ఎమ్మెల్యేలు కలిగిన ఎంఐఎం, మరో ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తున్నారు. ఈ కారణంగా జగన్‌తో కనీసం 40 మంది కాంగ్రెసు ఎమ్మెల్యేలు రావాలి. కాని అంతమంది వచ్చే అవకాశం లేనట్లుగానే కనిపిస్తోంది. ఈ విషయంపై జగన్ తన ముఖ్యనేతలతో చర్చించే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications