వైయస్ జగన్‌కు విరుగుడుగా సిఎం కిరణ్ కుమార్ రెడ్డి విశ్వాస తీర్మానం

ఈ నెల 4,6 తేదీల్లో శాసనసభ, మండలి ఉభయ సభలను సమావేశ పరచే ఆలోచనలో కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో ఎదురు తిరిగే తమ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులపై వేటు వేస్తే సరిపోతుందని అనుకుంటున్నట్లు సమాచారం. ఇదే సమయంలో శాసనసభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక పూర్తి చేయాలని, శాసనసమండలి చైర్మన్ ఎంపికను పూర్తి చేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఒక్కసారి ప్రభుత్వం బలపరీక్షకు దిగితే మరో ఏడాది పాటు అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించడానికి వీలు కాదని, అదే సమయంలో ప్రభుత్వానికి బలం లేదనే ప్రతిపక్షాల నోళ్లు మూత పడతాయని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.
ప్రభుత్వం బలపరీక్షకు దిగితే వైయస్ జగన్ వెంట వెళ్తున్న శాసనసభ్యులపై చర్యలు తీసుకోవడానికి, ప్రభుత్వానికి మెజారిటీ లేదనే విమర్సలకు తాళం వేయడానికి వీలవుతుందని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. బలపరీక్షకు సిద్ధపడి నెగ్గడం ద్వారా పాలన గాడిలో పడుతుందని కూడా ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications