తెలంగాణపై నేతలపై నాగం ఒత్తిడి, ద్రోహులుగా మిగలవద్దని పిలుపు

తెలంగాణ రాజకీయ నాయకులంతా ఒక వేదిక మీదికి వచ్చి, ఉమ్మడిగా ఓ నిర్ణయం తీసుకుందామని, రాజకీయ సంక్షోభాన్ని సృష్టిద్దామని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం కోల్డ్ స్టోరేజీలో ఉంచబోతోందని అర్థమవుతోందని ఆయన అన్నారు. ఎన్నికలకు సిద్దపడుదామని చెప్పడం ద్వారా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ అంశాన్ని మర్చిపోదామనే సంకేతాలు ఇచ్చారని ఆయన విమర్శించారు. తెలంగాణ అంశంపై పోరాటానికి కాంగ్రెసు తెలంగాణ నేతలు విరామం ఇస్తున్నారని ఆయన అన్నారు.
తన ఎజెండా, జెండా వేరని తెలుగుదేశం తెలంగాణ నాయకులు అనడాన్ని ఆయన ఖండించారు. తాను ఏ పార్టీలోనూ చేరబోవడం లేదని, తన జెండా ఎజెండా కూడా తెలంగాణ అంశమేనని ఆయన అన్నారు. తెలంగాణ అనుకూలంగా పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని ఒప్పిస్తే తాను తెలుగుదేశం తెలంగాణ నాయకులతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications