జగన్‌పై వైయస్సార్ కాంగ్రెసు వ్యవస్థాపకుడు శివకుమార్ తిరుగుబాటు

శివకుమార్‌కు కొన్ని హామీలు ఇచ్చి జగన్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీని సొంతం చేసుకున్నారు. తనకు పార్టీ ఉపాధ్యక్ష పదవి ఇస్తానని జగన్ హామీ ఇచ్చారని, ఆ మాటను జగన్ నిలబెట్టుకోలేదని శివకుమార్ అంటున్నట్లు తెలుస్తోంది. గత మూడు, నాలుగు రోజులుగా అదృశ్యమైన శివకుమార్ అకస్మాత్తుగా ఢిల్లీలో ప్రత్యక్షమయ్యారు. శివకుమార్ తిరుగుబాటు నేపథ్యంలో వైయస్ జగన్ గురువారం హైదరాబాదులోని తన నివాసంలో సీనియర్ నాయకులతో సమావేశమయ్యారు. న్యాయవాదుల సలహాలను కూడా ఆయన తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. సాంకేతికంగా ఏ విధమైన ఇబ్బందులు ఎదురవుతాయనే విషయంపై జగన్ ప్రధానంగా దృష్టి పెట్టారు.












Click it and Unblock the Notifications