వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
స్పీకర్ ఎన్నికలో వైయస్ విజయమ్మకు ఓటు హక్కు ఉండదా?

శనివారం జరిగే స్పీకర్ ఎన్నికకు కాంగ్రెసు సీనియర్ శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి ప్రోటెం స్పీకర్‌గా వ్యవహరిస్తారు. స్పీకర్ పదవికి అభ్యర్థిగా ఎంపికైన నాదెండ్ల మనోహర్ తన డిప్యూటీ స్పీకర్ పదవికి గురువారం సాయంత్రం రాజీనామా చేశారు. దీంతో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసుపై కూడా ఇప్పుడిప్పుడే నిర్ణయం తీసుకునే అవకాశాలు లేవు. స్పీకర్ ఎన్నిక పూర్తయిన తర్వాత కొత్త స్పీకర్ దానిపై నిర్ణయం తీసుకుంటారా, లేదంటే శాసనసభ నడిచినప్పుడే అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించాలనే విషయాన్ని ముందుకు తెస్తారా అనేది తెలియడం లేదు.