ఫేస్‌బుక్ ఎదుగుదల రేటు: టాప్‌లో బ్రెజిల్, ఆరవ స్దానంలో ఇండియా

సర్వే నిర్వహించిన స్టాటటిక్స్ సంస్ద సోషల్ బేకర్స్ ప్రకారం ఒక్క మే నెలలో ఫేస్‌బుక్ ఖాతాదారులుగా బ్రెజిల్‌లో 1.9మిలియన్ జనాభా చేరడం జరిగిందని వెల్లడించింది. దీంతో ఫేస్‌బుక్ వాడే దేశంగా బ్రెజిల్ ఎదుగుదల రేటు 11శాతంతో నెంబర్ వన్ స్దానంలో నిలచింది. ఇక ఇండోనేషియా ఎదుగుదల రేటు 4.15శాతంతో రెండవ అతిపెద్ద దేశంగా రికార్డు నెలకోల్పింది. ఆ తర్వాత స్దానాలలో ఫిలిఫ్పేన్స్, మెక్సికో తమ తమ స్దానాలను ఆక్రమించాయి. ఇక ఇండియా విషయానికి వస్తే 3.6శాతంతో ఆరవ స్దానంలో ఉంది. అర్జెంటీనా ఎదుగుదల రేటు 7.6 శాతంగా ఉంది.
ఇక యునైటెడ్ స్టేట్స్ విషయానికి వస్తే ఎక్కువ మంది యూజర్స్ ఉన్న సింగల్ దేశంగా తన స్దానాన్ని సుస్దిరం చేసుకుంది. మొత్తం జనాభాలో 149మిలియన్ అమెరికన్స్ ఫేస్‌బుక్ పేజిని కలిగి ఉన్నట్లు తెలిసింది. అంతేకాకుండా అందులో సగం మంది యూజర్స్ ఎల్లప్పుడూ ఫేస్‌బుక్‌తో బిజిగా ఉన్నట్లు సర్వే తెలిపింది. ఇక ఇండోనేషియా విషయానికి వస్తే 37మిలియన్ ఫేస్ బుక్ యూజర్స్ కలిగి ఉండగా, లండన్ విషయానికి వస్తే ఫేస్‌బుక్ ఛార్ట్స్‌లలో 29మలియన్ రిజస్టర్డ్ యూజర్స్‌తో మూడవ స్దానంలో ఉంది.
ఏది ఏమైతేనేం ఈజిప్ట్ ఒక్క మే నెలలోనే 11.1శాతం ఎదుగుదల రేటుతో నెంబర్ వన్ స్దానాన్ని దక్కించుకుంది. ఇది మాత్రమే కాకుండా ఫేస్‌బుక్‌లో ఈజిప్ట్ జనాభా ఎదుగుదల రేటుపై ఫేస్‌బుక్ యాజమాన్యం వారి ఆనందాన్ని తెలియజేసింది.