అవిశ్వాసంతో తెలంగాణ కాంగ్రెసు ఎమ్మెల్యేలపై పెరిగిన ఒత్తిడి

ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాసంలో ఓటు వేయాలని కోరారు. స్థానిక ప్రజలు కూడా ఆయా ఎమ్మెల్యేలపై ప్రభుత్వ వ్యతిరేక ఓటుకు ఒత్తిడి తీసుకు రావాలన్నారు. తెలంగాణ అంశంపై తెలంగాణ ఎమ్మెల్యేలు అవిశ్వాసం పెట్టాలని తెలంగాణ ఫ్రంట్ చైర్మన్ గద్దర్ కూడా కోరారు. తెలంగాణను కేంద్ర బిందువుగా అవిశ్వాస తీర్మానం పెట్టాలని ఆయన ఎమ్మెల్యేలను కోరారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అవిశ్వాసం పేరిట తెలంగాణ అంశాన్ని పక్కదారి పట్టించడానికి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.
అవిశ్వాస తీర్మానంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తానని టిఆర్ఎస్ సస్పెండెడ్ శాసనసభ్యుడు కావేటి సమ్మయ్య అన్నారు. కాంగ్రెసు తెలంగాణ ఎమ్మెల్యేలకు తెలంగాణపై తమ చిత్తశుద్ధి నిరూపించుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు. తెలంగాణ కాంగ్రెసు ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయకుంటే ప్రజలు వారిని నమ్మరని మాజీ ఎంపీ, టిఆర్ఎస్ నేత వినోద్ కుమార్ అన్నారు. వారు తెలంగాణ వ్యతిరేక కాంగ్రెసు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాలన్నారు.