Telangana Budget 2026 :సంక్షేమం అభివృద్ధికే భట్టి బడ్జెట్ అధిక ప్రాధాన్యత..!
తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే 2026-27 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ను ప్రభుత్వం నేడు శాసనసభలో ప్రవేశపెట్టింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శాసనమండలిలో ఈ పద్దులను ప్రవేశపెట్టారు. ఈసారి బడ్జెట్ పరిమాణం సుమారు రూ.3.30 లక్షల కోట్లుగా ఉంది. గత ఏడాదితో పోలిస్తే 8-10% వృద్ధిని చూపిస్తూ, సంక్షేమం మరియు అభివృద్ధి పథకాలకు ప్రభుత్వం పెద్దపీట వేసింది.

ప్రధానంగా రాష్ట్రంలోని సంక్షేమ పథకాల కోసం రికార్డు స్థాయిలో రూ. లక్ష కోట్లకు పైగా నిధులు కేటాయించడం జరిగింది. ఇటు మౌలిక సదుపాయాల కల్పనతో పాటు, అటు పేదల సంక్షేమానికి సమ ప్రాధాన్యత ఇస్తూ సమతుల్యమైన బడ్జెట్‌ను ప్రభుత్వం రూపొందించినట్లు ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. గ్యారెంటీ పథకాల అమలు, వ్యవసాయం మరియు విద్యారంగాలకు కేటాయింపులపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.బడ్జెట్ హైలైట్స్ మరియు తాజా అప్‌డేట్స్ కోసం మా లైవ్ బ్లాగ్‌ను ఫాలో అవ్వండి.












Click it and Unblock the Notifications