గొడవ మధ్య శానససభ స్పీకర్‌గా ఎన్నికైన నాదెండ్ల మనోహర్

స్పీకర్ ఎన్నిక తర్వాత ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు - ప్రభుత్వంపై వ్యతిరేకతతో తాము స్పీకర్ పదవికి పోటీ పెట్టామని, తమ అభ్యర్థిని కూడా పరిగణనలోకి తీసుకోకుండా ఎన్నిక జరిగిపోయినట్లు ప్రకటించారని అన్నారు. శాసనసభ్యులను సంతలో మాదిరిగా కొంటున్నారని ఆయన అన్నారు. పోటీ ఉన్నప్పుడు మూజువాణి ఓటు ద్వారా ఎన్నిక జరిగినట్లు ఎలా ప్రకటిస్తారని చంద్రబాబు అడిగారు. ఇవాళ ప్రజాస్వామ్యం అపహాస్యానికి గురైందని ఆయన అన్నారు.
బులిటెన్ విడుదల విషయంలో తన వైపు నుంచే తప్పు జరిగిందని ప్రోటెం స్పీకర్ చెప్పారు. తొలి బులిటెన్‌ను సస్పెండ్ చేస్తూ తీర్మానం పెట్టామని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. కాగా, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వర్గం శాసనసభలో మౌనంగా ఉంది. డివిజన్‌కు తమకు అభ్యంతరం లేదని ముఖ్యమంత్రి చెప్పారు. దీంతో ప్రోటెం స్పీకర్ జెసి దివాకర్ రెడ్డి డివిజన్‌కు ఆదేశించారు.












Click it and Unblock the Notifications