సౌత్‌లో హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన లేడి ఓరియేంటేడ్ సినిమాలు ఇవే..!
ఒకప్పుడు చిత్ర పరిశ్రమలో బాక్సాఫీస్ వద్ద స్టార్ హీరోల సినిమాలే మంచి సక్సెస్ సాధించాయి. 50 రోజులు, 100 రోజులు.. వంద కోట్ల కలెక్షన్స్, పాన్ ఇండియా హిట్.. భారీ ఓపెనింగ్స్ ఇలా అన్నీ హీరోల సినిమాలకే పరిమితమయ్యేవి. అయితే గత కొన్నేళ్లుగా మాత్రం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. బలమైన కథ, ఆకట్టుకునే కథనం, నటనకు ప్రాధాన్యం ఉన్న లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా ప్రేక్షకుల నుంచి అద్భుతమైన ఆదరణ పొందుతూ బాక్సాఫీస్ వద్ద కోట్ల రూపాయల వసూళ్లు సాధిస్తున్నాయి.
ముఖ్యంగా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ చిత్ర పరిశ్రమల్లో కథానాయికల చుట్టూ తిరిగే కథలకు మంచి డిమాండ్ ఏర్పడింది. మహిళా ప్రధాన కథాంశాలతో తెరకెక్కుతున్న చిత్రాలు విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా, కమర్షియల్‌గా కూడా భారీ విజయాలను నమోదు చేస్తున్నాయి. దీంతో నిర్మాతలు కూడా మహిళా కథానాయికలతో భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించేందుకు ఆసక్తి చూపుతున్నారు.

హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాలు ఇవే..
లోకా..
ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన సౌత్ ఇండియన్ ఉమెన్-లెడ్ చిత్రాల్లో కల్యాణి ప్రియదర్శన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సూపర్ హీరో యాక్షన్ ఫాంటసీ చిత్రం 'లోకా' అగ్రస్థానంలో నిలిచింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.302 కోట్ల గ్రాస్ వసూలు చేసి సౌత్ ఇండియన్ లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో ఆల్‌టైమ్ నంబర్-1 స్థానాన్ని దక్కించుకున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
మా ఇంటి బంగారం..
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'మా ఇంటి బంగారం' కూడా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. యాక్షన్, ఎమోషన్, ఫ్యామిలీ డ్రామా అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది.
మహానటి..
తెలుగు సినిమా చరిత్రలో మహిళా ప్రధాన చిత్రాల గురించి మాట్లాడితే 'మహానటి' ప్రత్యేక స్థానం దక్కించుకుంది. కీర్తి సురేష్ అద్భుత నటనతో తెరకెక్కిన ఈ బయోపిక్ ప్రపంచవ్యాప్తంగా రూ.85 కోట్ల గ్రాస్ సాధించి విమర్శకుల ప్రశంసలతో పాటు జాతీయ అవార్డులను కూడా అందుకుంది.
రుద్రమదేవి..
చారిత్రక నేపథ్యంతో రూపొందిన 'రుద్రమదేవి' రూ.81 కోట్లకు పైగా వసూళ్లు నమోదు చేసి అప్పట్లోనే సరికొత్త రికార్డులు సృష్టించింది.
అలాగే అనుష్క శెట్టి నటించిన 'అరుంధతి', 'భాగమతి' చిత్రాలు కూడా మహిళా ప్రధాన చిత్రాల మార్కెట్‌ను మరోస్థాయికి తీసుకెళ్లాయి. హారర్, థ్రిల్లర్, ఫాంటసీ అంశాలతో రూపొందిన ఈ సినిమాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుని వరుస విజయాలు సాధించాయి. ప్రస్తుతం కూడా ఈ చిత్రాలు లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు బెంచ్‌మార్క్‌లుగా నిలిచాయి.
ఇక మలయాళ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చిన 'సూక్ష్మదర్శిని' కూడా మంచి వసూళ్లు సాధించి ఈ జాబితాలో చోటు సంపాదించింది. కంటెంట్ ఆధారిత చిత్రాలకు ప్రేక్షకులు ఎంతగా ఆదరణ చూపిస్తున్నారో ఈ సినిమా మరోసారి నిరూపించింది.












Click it and Unblock the Notifications