వైభవ్ సూర్యవంశీకి యువరాజ్ సింగ్ క్రేజీ ముద్దుపేరు! ఏంటో తెలుసా?
భారత క్రికెట్లో ఓ కెరటంలా ఎదుగుతున్న 15 ఏళ్ల యువ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ.. లండన్‌లోని ప్రతిష్టాత్మక వింబుల్డన్ వేదికపై మెరిశాడు. ఆదివారం జరిగిన వింబుల్డన్ ఫైనల్లో యువరాజ్ సింగ్, వైభవ్ సూర్యవంశీ తొలిసారిగా కలుసుకున్నారు. ఈ వేదికపై ఫైనల్ మ్యాచ్‌ను యువరాజ్ సింగ్.. సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీలతో కలిసి ప్రత్యక్షంగా వీక్షించాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే తన బ్యాటింగ్ విధ్వంసంతో ఆకట్టుకున్న వైభవ్ సూర్యవంశీ.. యువరాజ్ సింగ్‌ను కూడా తన అభిమానిగా మార్చుకున్నాడు. ప్రపంచంలోని బౌలర్లందరికీ వైభవ్ బాస్ అయిపోయాడని.. అందుకే అతడిని 'బేబీ బాస్' అని పిలుస్తారని యువరాజ్ సింగ్ చెప్పుకొచ్చాడు. దీనికి సంబంధించి వీరిద్దరి వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
వైభవ్ సూర్యవంశీని కలిసిన యువరాజ్ సింగ్
జులై 12న యానిక్ సినర్, అలెగ్జాండర్ జ్వెరెవ్‌ల మధ్య జరిగిన వింబుల్డన్ ఫైనల్‌ను వీక్షించడానికి యువరాజ్ సింగ్ హాజరయ్యాడు. అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ కూడా అక్కడే ఉన్నాడు. స్టార్ స్పోర్ట్స్ విడుదల చేసిన ఓ వీడియోలో... అభిషేక్ శర్మ మొదట వైభవ్ సూర్యవంశీని ఎలా అనిపిస్తుందని అడుగుతాడు. దానికి వైభవ్ సూర్యవంశీ.. నాకు చాలా బాగా అనిపిస్తోందని అని బదులిచ్చాడు. ఆ తర్వాత మైక్రోఫోన్ చేతిలోకి తీసుకున్న యువరాజ్ సింగ్ మాట్లాడుతూ.. "నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. నేను వైభవ్ సూర్యవంశీని కలవడం ఇదే తొలిసారి. నేను అతడిని బేబీ బాస్ అని పిలుస్తాను. వైభవ్ బౌలర్లకు బాస్ అయిపోయాడు కాబట్టి అందరూ అతడిని బేబీ బాస్ అని మొదలుపెట్టారు. ఈ రోజు అతడిని కలవడం నాకు చాలా ఆనందంగా ఉంది." అని యువరాజ్ సింగ్ పేర్కొన్నారు.

వైభవ్‌ను బేబీ బాస్ అని ఎందుకు పిలుస్తారు?
వైభవ్ సూర్యవంశీ తన విధ్వంసకర బ్యాటింగ్ కారణంగా "బేబీ బాస్" గా ప్రసిద్ధి చెందాడు. ఐపీఎల్ 2026లో అత్యధిక పరుగులు సాధించిన అనంతరం సోషల్ మీడియాలో వైభవ్ సూర్యవంశీకి ఈ పేరు రావడం ప్రారంభమైంది. ఈ మాట యువరాజ్ సింగ్ నోటి నుంచి వినడం నిజంగా అద్భుతం. యువరాజ్ సింగ్ తన కాలంలో గొప్ప సిక్సరు బాదే ఆటగాళ్లలో ఒకడు. ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ యువరాజ్ సింగ్ అడుగుజాడల్లో నడిచాడు.
Abhishek Sharma to Vaibhav Suryavanshi : "kaisa lag Raha hai"?
— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) July 12, 2026
Vaibhav Suryavanshi : "achha lag Raha hai"
Abhishek Sharma : isko achha lag Raha hai to ham sab Ko achha lag Raha hai iska achha lagna bahot jaruri hai"😂❤️ pic.twitter.com/FwuLfg9FCH
వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ అరంగేట్రం
వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రం అంతగా ఆకట్టుకోలేదు. తన తొలి 3 ఇన్నింగ్స్‌లలో వైభవ్ సూర్యవంశీ అత్యధిక స్కోరు 15 మాత్రమే. ఇంగ్లాండ్‌లోని వేగవంతమైన పిచ్‌లపై వైభవ్ సూర్యవంశీ ఇబ్బందిపడ్డాడు. అయితే జులై 23న జింబాబ్వేతో ప్రారంభమయ్యే 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తనను తాను నిరూపించుకోవడానికి వైభవ్ సూర్యవంశీకి ఇప్పుడు ఓ అవకాశం లభించింది.


Click it and Unblock the Notifications