హైకోర్టు ఆదేశాలపై సుప్రీంలో పంతం నెగ్గించుకున్న విజయ్..!

తమిళనాడులో తొలిసారి ప్రభుత్వాన్ని నడుపుతున్న విజయ్(Vijay).. పాలనపై తన మార్కు చూపించేందుకు ప్రయత్నిస్తున్నారు. అదే క్రమంలో దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయాన్ని హైకోర్టు తప్పుబట్టి ఓ తీర్పు ఇచ్చింది. దీనిపై సుప్రీంకోర్టు (supreme court)ను ఆశ్రయించిన విజయ్ కు ఇవాళ భారీ ఊరట దక్కింది. ఈ మేరకు సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

ఇండీ కూటమిలో విజయ్ తో కలిసి..! తేల్చేసిన స్టాలిన్..!
ఇండీ కూటమిలో విజయ్ తో కలిసి..! తేల్చేసిన స్టాలిన్..!

బక్రీద్ లేదా మరే ఇతర రోజునైనా రాష్ట్రంలో ఆవు లేదా దూడను వధించకుండా చూడాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ గతంలో మద్రాస్ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. దీనిపై విజయ్ సర్కార్ సుప్రీంకోర్టు ను ఆశ్రయించింది. ఈ కేసును విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. స్టే విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.

Supreme Court Halts Madras HC Order Imposing Blanket Ban on Cow Slaughter
SIR బాధితులకు సుప్రీంకోర్టులో భారీ ఊరట..! కీలక ఆదేశాలు..!
SIR బాధితులకు సుప్రీంకోర్టులో భారీ ఊరట..! కీలక ఆదేశాలు..!

తమిళనాడు జంతు సంరక్షణ చట్టం 1958'లోని సెక్షన్ 4 ప్రకారం అనుమతించబడిన సందర్భాల్లో తప్ప, రాష్ట్రంలో గోవధపై పూర్తి నిషేధం విధిస్తూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ తమిళనాడు సర్కార్ గత వారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. గోవధపై పూర్తి నిషేధం విధించేలా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు..తమిళనాడు జంతు సంరక్షణ చట్టం 1958కు విరుద్ధమని విజయ్ సర్కార్ సుప్రీంకోర్టులో వాదించింది. 1958 నాటి చట్టం ప్రకారం పశువు వయస్సు 10 ఏళ్లు దాటినా లేదా సంతానోత్పత్తికి లేదా వ్యవసాయ పనులకు పనికిరాకుండా పోయినా (తగిన ధృవీకరణ పత్రం జారీ చేయబడిన షరతుకు లోబడి), కొన్ని పరిస్థితులలో పశువుల వధకు అనుమతి ఉంటుందని తెలిపింది. ఈ అంశాన్ని విచారిస్తున్నప్పుడు, హైకోర్టు ఉత్తర్వులో సవరణ అవసరమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. దీంతో ఆ ఉత్తర్వు అమలుపై తక్షణమే స్టే విధించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+