నాదెండ్ల మనోహర్‌కు జగన్ వర్గం మద్దతు, 158 ఓట్లతో గెలుపు

తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కెఇ కృష్ణమూర్తికి తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ అయిన నాగం జనార్దన్ రెడ్డి కూడా మద్దతు పలికారు. తెలుగుదేశం అసమ్మతి శాసనసభ్యులు జోగు రామన్న, హరీశ్వర్ రెడ్డి కూడా మద్దతిచ్చారు. శాసనసభ స్పీకర్‌గా ఎన్నికైన నాదెండ్ల మనోహర్‌ను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు, ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి అభినందించారు. వారి సమక్షంలో నాదెండ్ల మనోహర్ స్పీకర్ పీఠాన్ని అధిష్టించారు.
కాగా, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మతో పాటు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యులు 11 మంది స్పీకర్ ఎన్నికకు దూరంగా ఉన్నారు. అనారోగ్యం కారణంగా కాంగ్రెసు శానససభ్యురాలు కుతూహలమ్మ, సోదరుడి మృతి కారణంగా అళ్ల నాని శాసనసభకు రాలేదు.












Click it and Unblock the Notifications