రామ్‌దేవ్ వెనుక ఆర్ఎస్ఎస్, ఆస్తులపై విచారణ: కపిల్, దిగ్విజయ్
National
oi-Srinivas G
By Srinivas
|
న్యూఢిల్లీ: బాబా రామ్‌దేవ్ దీక్ష వెనుక రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ హస్తం ఉందని కేంద్రమంత్రి కపిల్ సిబాల్ ఆదివారం విమర్శించారు. బాబా దీక్షతో ఆయన వెనుక ఆర్ఎస్ఎస్ ఉందని ఆర్థం అవుతుందని సిబాల్ పేర్కొన్నారు. బాబా కేవలం యోగా శిబిరానికి రామ్‌లీలా మైదానం అనుమతులు తీసుకున్నారని అన్నారు. కేవలం ఐదువేల మందికి మాత్రమే అనుమతి కోరారని, అయితే 50వేల మందిని ఎందుకు సమీకరించారని ఆయన ప్రశ్నించారు. బాబా దీక్ష సందర్భంగా ఎలాంటి పరిస్థితులు అయినా ఎదుర్కొనడానికి కేంద్రం సిద్ధంగా ఉందని అన్నారు. ఇతర మంత్రులతో యోగా గురు బాబా జరిపిన వాటిపై మాట్లాడటానికి ఆయన నిరాకరించారు. మేము బాబా దీక్షపై సరిగానే స్పందిస్తున్నామని చెప్పారు.
బిజెపితో బాబా కుమ్మక్కయ్యారని కూడా సిబాల్ ఆరోపించారు. కాగా యోగా గురువు రామ్ దేవ్ బాబా ఆస్తులపై విచారణ చేపట్టాలని ఏఐసిసి జనరల్ సెక్రటరీ దిగ్విజయ్ సింగ్ డిమాండ్ చేశారు. యోగా శిబిరానికి బాబాకు అనుమతి ఉందని కానీ ఆయన యోగా పేరుతో రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. సత్యాగ్రహ దీక్ష శిబిరం తొలగింపు సబబేనని ఆయన సమర్థించారు. కాగా బాబాపై ప్రభుత్వం న్యూఢిల్లీలో ఓ దొమ్మీ కేసు నమోదు చేయడం విశేషం.
"Today it has become clear that he is another face of the RSS," a combative HRD minister Kapil Sibal said in the first official reaction on the forced dispersal of Ramdev and thousands of his supporters from Ramlila ground after midnight Saturday.
Story first published: Sunday, June 5, 2011, 12:52 [IST]