విశాఖపట్నం: జిల్లాలో భార్యపై భర్తే యాసిడ్‌తో దాడి చేసిన విషాద సంఘటన చోటు చేసుకుంది. విశాఖపట్నంలోని పెద్దవాల్తేరులోని వాంబే కాలనీకి చెందిన మున్నా అనే వ్యక్తి తన భార్య సత్యపై యాసిడ్ పోశాడు. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు, బంధువులు ఆమెను వెంటనే స్థానిక కెజిహెచ్ వైద్యశాలకు తరలించారు. సత్యకు మున్నాతో ఏడెళ్ల క్రితం వివాహం అయింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. గత కొద్ది రోజులుగా మద్యపానానికి అలవాటు పడిన మున్నా భార్యను బాగా హింసించసాగాడు.
అయితే భార్యకు, భర్తకు విభేదాలు రావడంతో భార్య సత్య తన సోదరుని ఇంటిలో ఉంటోంది. మున్నా పిల్లలను మాత్రం తన వెంట తీసుకు పోయాడు. అయితే రాత్రి సమయంలో సత్య వద్దకు వచ్చి ఆమెకు మాయమాటలు చెప్పి మున్నా తనతో తీసుకు వెళ్లి ఆమెపై యాసిడ్‌తో దాడి చేశాడు.