తెలంగాణ ఇవ్వకుంటే కాంగ్రెసు పార్టీ నాశనమే: పాల్వాయి గోవర్దన్ రెడ్డి
State
oi-Srinivas G
By Srinivas
|
హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని కేంద్రం ప్రకటించకుంటే తెలంగాణలో కాంగ్రెసు నాశనమే అని కాంగ్రెసు పార్టీ సీనియర్ నాయకుడు పాల్వాయి గోవర్దన్ రెడ్డి మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ అన్నారు. కాంగ్రెసు బాగుండాలి, తెలంగాణ ఇవ్వాలన్నారు. లేదంటే తెలంగాణ ఇస్తామని చెప్పుకుంటూ ప్రజలను మోసం చేస్తూ కాంగ్రెసులో ఉంటూ వచ్చే ఎన్నికల్లో గెలవలేమని అన్నారు. ప్రజల అభిప్రాయానికి కాంగ్రెసు తల వంచక తప్పదు. తెలంగాణ ఇవ్వక తప్పదని ఆయన అభిప్రాయపడ్డారు. పిసిసి అధ్యక్షుడిగా బొత్స నియామకం తెలంగాణను అనుకూలం అన్నారు. బొత్స ఎప్పుడూ కూడా తెలంగాణకు వ్యతిరేకం అని చెప్పలేదన్నారు.
వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి విషయం పరంగా చూస్తే బొత్సను నియమించి పార్టీ మంచి నిర్ణయం తీసుకుందన్నారు. బొత్స నియామకం సరైనదన్నారు. తెలంగాణ వారికి పదవులు ఇచ్చినా వెలగబెట్టేది ఏమీ లేదన్నారు. బొత్స మూడు ప్రాంతాలను బలోపేతం చేస్తాడని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రెండు నలల క్రితమే బొత్సను పిసిసి అధ్యక్షుడిగా ఎన్నిక చేయాలని తాను అధిష్టానానికి సూచించానని చెప్పారు.
Congress senior leader Palvai Govardhan Reddy said today that congress will weak if not give Telangana. He welcomed Botsa Satyanarayana as PCC president.
Story first published: Tuesday, June 7, 2011, 15:54 [IST]