సిఎంకు తెలంగాణ సెగ, మీడియాకు కిరణ్ కుమార్ రెడ్డి క్లాస్

తన అసహనాన్ని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మీడియాపై ప్రదర్శించారు. మీడియాపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మీడియా రాంగ్ టూర్‌లో వెళ్తోందని ఆయన విమర్శించారు. ఒక పత్రిక, ఒక చానెల్ వార్తలను ఎవరూ నమ్మడం లేదని, రెండు మూడు పత్రికలు చదవి, చానెళ్లు చూసి ఆ వార్తలు నిజమా, కాదా అని తేల్చుకుంటారని ఆయన అన్నారు. మీడియా తన బాధ్యతను విస్మరించిందని ఆయన విమర్శించారు. మీడియాను నమ్మే స్థితిలో ప్రజలు లేరని ఆయన అన్నారు. ప్రభుత్వం తప్పు చేస్తే ఎత్తి చూపాలని, కానీ 80 శాతం మంచిని పట్టించుకోకుండా 20 శాతం తప్పులనే మీడియా ఎత్తి చూపుతోందని ఆయన అన్నారు. ప్రభుత్వంపై పని కట్టుకుని విమర్శలు చేయడం సరి కాదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications