న్యూఢిల్లీ: 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న డిఎంకె మాజీ ఎంపీ కనిమొళికి మరోసారి న్యాయస్థానంలో చుక్కెదురు అయ్యింది. సాక్ష్యాధారాలను తారుమారు చేసే అవకాశం ఉందని ఆమె బెయిల్ పిటిషన్‌ను పాటియాలా ప్రత్యేక కోర్టు బుధవారం తిరస్కరించింది. కాగా కళైంజర్ టీవీ ఎండీ శరత్‌కుమార్ బెయిల్ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. న్యాయస్థానం కనిమొళికి బెయిల్ నిరాకరించటంతో ఆమె తల్లి రజతీ అమ్మాళ్ కోర్టులో కన్నీటిపర్యంతమయ్యారు. 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం కేసులో కనిమొళిని అరెస్టు చేసి తీహార్ జైలుకి తరలించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కనిమొళి తీహార్ జైలులో ఉన్నారు.