యూట్యూబ్ బాక్సాఫీస్‌లో బాలీవుడ్ బ్లాక్ బస్టర్స్‌ని ఫ్రీగా చూసేయ్యండి...

యూట్యూబ్ బాక్సాఫీస్‌లో వేరు వేరు కేటగిరిలలో ఇండియన్ సినిమాలకు సంబంధించిన సినిమాలు ఉన్నాయి. ఇండియాలో ఉన్నటువంటి లోకల్ లాంగ్వేజిలలో కలపి మొత్తం 1500 సినిమాల వరకు యూట్యూబ్ బాక్సాఫీస్ లైబ్రరీరిని అప్‌టేడ్ చేయడం జరిగింది. యూట్యూబ్ బాక్సాఫీస్‌లో ఓపెనింగ్ మూవీగా వేసినటువంటి సినిమా యాష్ రాజ్ ఫిల్మ్స్ సమర్పణలో వచ్చినటువంటి బాలీవుడ్ సినిమా బ్యాండ్ బాజా బారత్. ఈసినిమాని యూట్యూబ్ బాక్సాఫీస్ 1080p HD రిజల్యూషన్ తో ప్రదర్శించింది. వీటితోపాటు యూట్యూబ్ బాక్సాఫీస్‌లో సినిమాని టేకింగ్ విధానం, సినిమాలో తీసివేసిన సీన్లు లాంటివి కూడా ఉంచడంతో యూట్యూబ్ బాక్సాఫీస్‌లో మంచి ఆదరణ లభించింది.
ఈ సందర్బంలో యూట్యూబ్ జపాన్ - ఎపాక్ కంటెంట్ డైరెక్టర్ గౌతమ్ ఆనంద్ మాట్లాడుతూ యూజర్స్ కోసం, ఎక్కువ మంది ప్రేక్షకులు యూట్యూబ్ బాక్సాఫీస్‌ని చూసిందేందుకు గాను ప్రీమియమ్ ఎకౌంట్స్‌ని ప్రవేశపెట్టనున్నామని తెలిపారు. ప్రతి నిమిషానికి యూట్యూబ్‌లో 48గంటల పాటు ప్రేక్షకులు చూసేటటువంటి కంటెంట్ అప్‌లోడ్ చేయడం జరుగుతుందన్నారు.