తెలంగాణ పేరిట కాంగ్రెసు, చంద్రబాబు కుమ్మక్కు: నాగం జనార్దన్ రెడ్డి

తెలంగాణ టిడిపి నేతలు తెలంగాణ అంశాన్ని పక్కన పెట్టి చంద్రబాబు తొత్తులుగా మారారని ధ్వజమెత్తారు. తాను జై తెలంగాణ అన్నందుకే తనను పార్టీ నుండి బహిష్కరించాలని ఆరోపించారు. జై తెలంగాణ అంటే తనపై చర్యలు తీసుకుంటారా అని ఆయన ప్రశ్నించారు. కాగా తాండూరులో గురువారం నిర్వహిస్తున్న తెలంగాణ రణభేరిని అడ్డుకొని తీరుతామని ఉస్మానియా విశ్వవిద్యాలయం ఐక్య కార్యాచరణ సమితి హెచ్చరించింది. చంద్రబాబుతో జై తెలంగాణ అనిపిస్తేనే టిడిపిని సభలను ఆహ్వానిస్తామన్నారు. లేదంటే అప్పటి వరకు నిరసనలు తెలియజేస్తామన్నారు.












Click it and Unblock the Notifications