వైయస్ జగన్, కెసిఆర్‌లకు ఆశాభంగం, మింగుడు పడని వాయిదా

సీమాంధ్ర వైయస్ జగన్, తెలంగాణలో కెసిఆర్ స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయఢంకాలు మోగిస్తారని విశ్లేషకులు కూడా అంటున్నారు. బహుశా, అధికార కాంగ్రెసు పార్టీకి కూడా అదే అంచనా ఉండి ఉంటుంది. సీమాంధ్ర విషయాన్ని వక్కన పెడితే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఘోరంగా ఉందనే అంచనాలు వస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల కోసమే తెలుగుదేశం తెలంగాణ ఫోరం ఆధ్వర్యంలో తెలంగాణ రణభేరీ బహిరంగ సభలు నిర్వహిస్తోందనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. స్థానిక సంస్థలు వాయిదా పడుతుండడంతో తెలుగుదేశం పార్టీ కూడా ఊపిరి పీల్చుకుంటుందని చెప్పడంలో సందేహం లేదు. మొత్తం మీద, జగన్, కెసిఆర్‌లకు అవకాశం రాకూడదనేదే కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల అభిమతం.












Click it and Unblock the Notifications