రాహుల్ గాంధీ వెబ్‌సైట్లపై హ్యాకర్ల దాడి: దర్యాఫ్తు చేస్తున్న సైబర్ టీం

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఓ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 66 కింద కేసు నమోదు చేశారు. ఢిల్లీ ప్రత్యేక పోలీసు విభాగం ఆధ్వర్యంలో హ్యాకర్లను తెలుసుకునేందుకు విచారణ చేపట్టింది. ఈ హ్యాకింగ్ ఏప్రిల్ 4 నుండి ఏప్రిల్ 19 మధ్య జరిగి ఉండవచ్చని సైబర్ పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అమేథి, రాయ్‌బరేలి వెబ్‌సైట్లు ప్రధానంగా తమ నియోజకవర్గ ప్రజల కోసం ఏర్పాటు చేశారు. రాహుల్ తన డొమెయిన్‌తో వెబ్‌సైట్ ఓపెన్ చేద్దామని చూసే సరికి అది ఓపెన్ కాలేదు. దీంతో అది హ్యాక్ అయినట్లు తెలుసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇ-మెయిల్ ఐడితో పాటు పాస్ వర్డ్ కూడా హ్యాక్ చేశారంట.












Click it and Unblock the Notifications