చంద్రబాబు అంటే కెసిఆర్‌కు భయం, రాజీనామాలకు సిద్ధం: టిడిపి

జెఏసి పెట్టిన ఈనెల 25వ తేదీ డెడ్‌లైన్‌కు తామంతా సిద్ధమేనని ఇందుకు కేసీఆర్ సిద్ధమేనా? అని సవాల్ విసిరారు. మళ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తే జెఏసి కిందే పోటీచేయాలని, ఇందుకు వారు సిద్ధమైతే కావాలంటే తాము తెలంగాణ భవన్‌కు వచ్చి రాజీనామాలు లేఖలు ఇస్తామని తెలిపారు. గీత పెడితే తెలంగాణభవన్ వద్దే తేల్చుకుందామని సవాలు చేశారు. ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్‌రావు, సీనియర్ నేత దేవేందర్‌గౌడ్, ఎంపీలు నామా నాగేశ్వరరావు, రాథోడ్, ఎమ్మెల్యేలు మహేందర్‌రెడ్డి, ఉమా మాధవరెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు, సీతా దయాకర్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి, కొత్తకోట దయాకర్‌రెడ్డి, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, రత్నం ప్రసంగించారు.
టీఆర్ఎస్ నేత కెసిఆర్ ఉద్యమం మానేసి పెత్తనం కోసం పోరాడుతున్నారని దేవేందర్‌గౌడ్ విమర్శించారు. టిడిపితోనేతెలంగాణ సాధ్యమన్నారు. డబ్బులు వసూలు చేస్తున్న టీఆర్ఎస్ వైపు వెళ్లాలా? ఏళ్ల తరబడి పెత్తందారీ వ్యవస్థ నడుపుతున్న కాంగ్రెస్ వైపు వెళ్లాలా? మీరే చెప్పండి అంటూ ప్రజలను కోరారు. డబ్బు కోసమే కెసిఆర్ ఉద్యమం నడుపుతున్నారని తెలంగాణ రావాలని ఆయనకు లేదని చెప్పారు. కెసిఆర్‌కు దమ్ము ఉంటే రాజీనామా చేసి మళ్లీ సొంత నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. మహబూబ్‌నగర్ నుంచి పోటీచేస్తే ఎవరి సత్తా ఏంటో తేలిపోతుందన్నారు. విద్యార్థులకు, ఉద్యోగులకు తలవంచుతాం కానీ దోచుకుతినే వారికి తలవంచేది లేదన్నారు.
చంద్రబాబును చూసి కెసిఆర్ ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. ఆయనకు దమ్ముంటే వర్షాకాలపు పార్లమెంట్ సమావేశాల్లో రాజీనామాకు సిద్ధపడాలని సవాల్ విసిరారు. కెసిఆర్ కాంగ్రెస్‌తో ఎంత ప్యాకేజీ మాట్లాడుకున్నాడో ప్రజలందరికీ తెలుసన్నారు. కెసిఆర్ మూడు మాసాలు బయటకు రాకుండా వేసవి సెలవులు తీసుకోవడంలో మర్మమేంటని మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. కెసిఆర్, కోదండరామ్ కలిసి కాంగ్రెస్ జెండాను మోయాలనుకుంటున్నారా అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. రణభేరి ఎవరికీ వ్యతిరేకం కాదని టిడిపి తన విధానాన్ని చెప్పేందుకే ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు కడియం శ్రీహరి చెప్పారు. టిడిపినిదెబ్బతీయడమే లక్ష్యంగా కెసిఆర్, కోదండరామ్ పని చేస్తున్నారని మోత్కుపల్లి నర్సింహులు విమర్శించారు.












Click it and Unblock the Notifications