వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబుకు కొత్త తలనొప్పి, పిఎసి చైర్మన్ పదవిపై ఎర్రబెల్లి హెచ్చరిక

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి కొత్త తలనొప్పి ఎదురైంది. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పిఎసి) చైర్మన్ పదవి నుంచి నాగం జనార్దన్ రెడ్డి తప్పుకున్న తర్వాత ఆ పదవి కోసం పార్టీలో పోటీ తీవ్రమైంది. ఈ పదవి కోసం పలువురు పోటీ పడుతుండడంతో చంద్రబాబు తల పట్టుకుంటున్నారు. పైగా, పార్టీ తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావు చంద్రబాబుకు హెచ్చరిక కూడా చేసినట్లు ప్రచారం జరుగుతోంది. పిఎసి చైర్మన్ పదవి ఇస్తానంటేనే తెలంగాణ ఫోరం కన్వీనర్ పదవి తీసుకుంటానని ఆయన చంద్రబాబుకు షరతు పెట్టారని అంటున్నారు. ఒకవేళ తనకు ఇవ్వని పక్షంలో అన్నపూర్ణకు గానీ, మహేందర్ రెడ్డికి గానీ ఇవ్వాలని ఆయన పట్టుపడుతున్నట్లు తెలుస్తోంది.

వరంగల్ జిల్లాకు చెందిన రేవూరి ప్రకాశ రెడ్డికి ఇస్తే మాత్రం ఊరుకునేది లేదని ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పినట్లు సమాచారం. ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా వరంగల్ జిల్లాకే చెందినవారు. దీంతో జిల్లాలో రేవూరి ప్రకాశ రెడ్డి ప్రాబల్యం పెరగకుండు అడ్డుపడుతున్నట్లు చెబుతున్నారు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన రావుల చంద్రశేఖర రెడ్డి ఈ పదవి కోసం పెద్గగా ప్రయత్నాలు చేయడం లేదు. అయితే, నాగం జనార్దన్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత ఆయన కొంత అసంతృప్తిగా ఉన్నట్లు చెబుతున్నారు. అసంతృప్తిని పోగొట్టడానికి రావుల చంద్రశేఖర రెడ్డికి ఆ పదవి ఇస్తే ఎలా ఉంటుందనే విషయంపై చంద్రబాబు ఆలోచన చేస్తున్నట్లు చెబుతున్నారు. నిజానికి, రంగా రెడ్డి జిల్లాకు చెందిన హరీశ్వర్ రెడ్డికి ఇవ్వాలని భావించారు. అయితే, ఆయన నాగం జనార్దన్ రెడ్డి వెంట వెళ్లడంతో ఆ పదవి దూరమైంది.

English summary
It is learnt that TDP president N Chandrababu Naidu is facing problem on PAC chairman post, as MLAs are in row.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X