వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్ దుకాణం మూసుకోవాల్సిందే, జైపాల్ రెడ్డిది రోజుకో మాట: విహెచ్

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ ఇస్తే తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు దుకాణం మూసుకోవాల్సిందేనని కాంగ్రెసు తెలంగాణ ప్రాంతం సీనియర్ నేత వి. హనుమంతరావు వ్యాఖ్యానించారు. తెలంగాణ జెఎసి పెట్టే డెడ్‌లైన్లకు తాము భయపడబోమని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తెలుగుదేశం తెలంగాణ రణభేరీని అడ్డుకోవడం సరి కాదని ఆయన అన్నారు. ప్రజలను రెచ్చగొట్టడం మంచిది కాదని ఆయన అన్నారు.

తెలంగాణపై కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి రోజుకో మాట్లాడడం సరి కాదని, దాన్ని ప్రజలు హర్షించరని ఆయన అన్నారు. డిసెంబర్ 9వ తేదీన తెలంగాణపై కేంద్ర హోం మంత్రి చిదంబరం ప్రకటన తన వల్లనే వచ్చిందన్న జైపాల్ రెడ్డి ఇప్పుడు తన ప్రమేయం లేదనడం సరి కాదని ఆయన అన్నారు. తెలంగాణ కోసం జైపాల్ రెడ్డి బయటకు వస్తే తెలంగాణ అమరవీరుల దీవెనలుంటాయని ఆయన అన్నారు.

శ్రీకృష్ణ కమిటీ ఎనిమిదవ అధ్యాయాన్ని ఆయన తీవ్రంగా తప్పు పట్టారు. మీడియాను, రాజకీయ నాయకులను మేనేజ్ చేస్తే తెలంగాణ ఉద్యమాన్ని అణచేయవచ్చునని శ్రీకృష్ణ కమిటీ చెప్పడంపై ఆయన మండిపడ్డారు. శ్రీకృష్ణ కమిటీ తెలంగాణ ఉద్యమంపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిందని ఆయన మండిపడ్డారు. తెలంగాణను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిందని ఆయన అన్నారు. శ్రీకృష్ణ కమిటీ ఎనిమిదో అధ్యాయాన్ని బయటపెట్టాలని తాము ప్రధాని మన్మోహన్ సింగ్‌ను కోరుతామని ఆయన చెప్పారు.

English summary
Congress Telangana region leader V Hanumanth Rao made comments against TRS president K Chanfrasekhar Rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X