వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిరంజీవి పార్టీ కథ ముగిసింది, విలీనానికి ఇసి గ్రీన్ సిగ్నల్

By Pratap
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
న్యూఢిల్లీ‌: రాష్ట్ర రాజకీయాల్లో మెగాస్టార్ చిరంజీవి నాయకత్వంలోని ప్రజారాజ్యం పార్టీ కథ ముగిసింది. కాంగ్రెసు ప్రాజరాజ్యం పార్టీ విలీనానికి కేంద్ర ఎన్నికల సంఘం పచ్చజెండా ఊపింది. విలీనానికి సంబంధించిన అధికార పత్రాలను ఇసి ప్రజారాజ్యం పార్టీ కార్యాలయానికి పంపించింది. కాంగ్రెసులో ప్రజారాజ్యం పార్టీ విలీనం ప్రక్రియ పూర్తయిందని ప్రజారాజ్యం పార్టీ నాయకుడు సి. రామచంద్రయ్య కూడా ప్రకటింటారు. విలీనం విషయాన్ని కార్యకర్తలకు తెలియజెప్పడమే ఇక మిగిలింది.

కాంగ్రెసులో ప్రజారాజ్యం పార్టీని విలీనం చేయడానికి ఇసికి సమర్పించిన పత్రంపై కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ సంతకం లేకపోవడంతో తొలుత ఆటంకం ఏర్పడింది. విలీనం పత్రంపై కాంగ్రెసు ప్రధాన కార్యదర్శి సంతకం చేశారు. అయితే, ఆ పత్రంపై రెండు పార్టీల అధ్యక్షుల సంతకాలు ఉండాలని ఇసి తెలిపింది. దీంతో కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ తన సంతకంతో మరో పత్రాన్ని ఇసికి సమర్పించారు. దీంతో విలీనానికి ఆటంకాలు తొలగిపోయాయి.

కాగా, విలీనాన్ని ప్రజలకు తెలియజెప్పేందుకు రాష్ట్రంలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని మెగాస్టార్ చిరంజీవి భావిస్తున్నారు. రాజమండ్రిలో గానీ విజయవాడలో గానీ ఈ విలీన సభ జరగాలని, దానికి సోనియా గాంధీ గానీ రాహుల్ గాంధీ గానీ రావాలని ఆయన అంటున్నారు. అయితే, కాంగ్రెసు అధిష్టానం ఆలోచన మరో విధంగా ఉంది. ఢిల్లీలోని ఎఐసిసి కేంద్ర కార్యాలయంలో చిరంజీవికి కాంగ్రెసు కండువా కప్పి విలీనం విషయాన్ని ప్రకటిస్తామని అంటోంది.

English summary
EC has accepted the merger of Prajarajyam party in Congress. this was announced by Prajarajyam party leader C Ramachandraiah.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X