హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మావోయిస్టు అగ్రనేత జగదీష్ అరెస్టు, కోర్టులో హాజరు పర్చాలని డిమాండ్

By Pratap
|
Google Oneindia TeluguNews

Maoists
హైదరాబాద్: మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ తగిలింది. మావోయిస్టు అగ్రనేత జగదీష్ మాస్టర్జీని బీహార్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జగదీష్ మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడని తెలుస్తోంది. బీహార్‌లోని పులువామా ప్రాంతంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా పక్కా సమాచారం అందుకున్న పోలీసులు జగదీష్‌ను అరెస్టు చేసినట్లు ఇక్కడికి సమాచారం అందింది. అతనితో పాటు ఓ మహిళను కూడా పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.

జగదీష్‌కు ప్రాణహాని ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఉన్న విప్లవ రచయితల సంఘం (విరసం) నాయకుడు వరవర రావు ఆందోళన వ్యక్తం చేశారు. జగదీష్‌ను వెంటనే కోర్టులో హాజరు పరచాలని ఆయన డిమాండ్ చేశారు. ఆయన గయాలోని సిఆర్‌పిఎఫ్ క్యాంపులో ఉన్నట్లు తెలుస్తోంది. గత ఏడాది కాలంగా బీహార్, జార్ఖండ్ రాష్ట్రాలతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా జగదీష్ కోసం గాలిస్తోంది. బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో మావోయిస్టు కార్యకలాపాల్లో జగదీష్ కీలక పాత్ర పోషించినట్లు చెబుతున్నారు.

English summary
Maoist leader Jagadish arrested in Bihar. Revolutionary poet Varavara demanded produce Jagadish before court.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X