హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆ మంత్రిది ఎప్పుడూ హల్‌చల్: ఎవరు ప్రమాణ స్వీకారం చేసినా అంతే!

By Srinivas
|
Google Oneindia TeluguNews

Danam Nagender
హైదరాబాద్: రాజధాని హైదరాబాదు నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న కార్మిక శాఖ మంత్రి దానం నాగేందర్ ఎప్పుడూ హల్ చల్‌గా కనిపిస్తారు. కాంగ్రెసు పార్టీలో ప్రముఖ స్థానంలో ఎవరు ప్రమాణ స్వీకారం చేసినా దానం నాగేందర్ హడావుడి కనిపించక మానదు. మూడు రోజుల క్రితం బొత్స సత్యనారాయణ ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారోత్సవం చేసిన సందర్భంగా దానం హల్ చల్ సృష్టించారు. నిత్యం బొత్స వెన్నంటే ఉన్నాడు. ఏనిమిది నెలల క్రితం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంలోని దానం హడావుడి స్పష్టంగా కనిపించింది. గవర్నర్ భవన్ వెళ్లే దారిలో మొత్తం దానం నాగేందర్ పోస్టర్లు నిండిపోయాయి. రాజ్ భవన్ ముందు కూడా కిరణ్‌కు స్వాగతం పలికే నాగేందర్ కటౌట్‌లే ఎక్కువ. అంతేకాదు గత కొంతకాలంగా తన మార్కు రాజకీయం నెరుపుతున్నట్టుగా కనిపిస్తోంది. ఆయితే ఆయన ఏం చేసినా రాజకీయ భవిష్యత్తు కోసమే అనేది కొందరి మాట.

2004 ఎన్నికలకు ముందు కాంగ్రెసు పార్టీలో ఉన్న దానం నాగేందర్, ఎన్నికలకు కొద్ది రోజుల ముందు తెలుగుదేశం పార్టీలో చేరారు. అయితే అనూహ్యంగా ఆయన అనుకున్నట్టుగా కాకుండా టిడిపి ఓడి కాంగ్రెసు పార్టీ అనూహ్య విజయం సాధించింది. అయితే టిడిపి నుండి దానం మాత్రం గెలిచారు. అయితే తాను టిడిపి నుండి గెలుపొందినప్పటికీ తన మనసు కాంగ్రెసుతోనే ఉందని చెబుతూ అధికార కాంగ్రెసులో చేరడానికి ఆయన టిడిపికి దాంతో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆ ఉప ఎన్నికలలో దానం ఓడిపోయినప్పటికీ ఆధికార కాంగ్రెసులోనే ఆయన ఉండిపోయి 2009 వరకు నిరీక్షించారు. ఆ తర్వాత వైయస్, రోశయ్య, కిరణ్ ముఖ్యమంత్రిత్వాలను అందరికి భిన్నంగా బలపర్చుకుంటూ వస్తున్నాడు. తాజా పిసిసి అధ్యక్షుడు బొత్స ప్రమాణ స్వీకారోత్సవంలో కూడా హడావుడి చేశారు. అయితే అధినాయకులను పలువురు విమర్శిస్తుంటారు, వారిపై కొందరు అలకబూనుతుంటారు, మరికొందరు స్తబ్దగా ఉంటారు. అందరికి భిన్నంగా దానం మాత్రం అందరికీ మద్దతు పలుకుతు రావడం విశేషం.

English summary
Minister Danam Nagender created hulchul in CM Kiran Kumar Reddy and pcc president Botsa Satyanarayana swear-in.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X