హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబుతో కారత్ భేటీ, వైయస్ జగన్‌తో దోస్తీ ప్లాన్‌కు బ్రేక్

By Pratap
|
Google Oneindia TeluguNews

Prakash Karat
హైదరాబాద్‌: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌తో దోస్తీ చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు చేసిన ప్రయత్నాలకు బ్రేకులు పడినట్లే కనిపిస్తోంది. రాఘవులు ప్రయత్నాలను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు దెబ్బ తీశారు. సిపిఎం ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ సోమవారం సాయంత్రం చంద్రబాబుతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో వారిద్దరి మధ్య జగన్‌తో జత కట్టాలనే రాఘవులు ఆలోచన ప్రస్తావనకు వచ్చినట్లు చెబుతున్నారు. అయితే, పశ్చిమ బెంగాల్‌లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రభుత్వం తమ కార్యకర్తలపై చేపట్టిన హింసాకాండపై చేసే ఉద్యమానికి సహకరించాలని కారత్ చంద్రబాబును కోరారు. దీన్నిబట్టి చంద్రబాబుకు దూరం కావడానికి సిపిఎం జాతీయ నాయకత్వం సిద్ధంగా లేదని అర్థమవుతోంది.

తాను చంద్రబాబును కలవడానికే వచ్చానని కారత్ సమావేశానంతరం మీడియా ప్రతినిధులతో చెప్పారు. పశ్చిమ బెంగాల్‌లోని పరిస్థితిని తాను చంద్రబాబుకు వివరించినట్లు ఆయన తెలిపారు. పశ్చిమ బెంగాల్‌లో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి తమకు సహకరించాలని తాను చంద్రబాబును కోరినట్లు ఆయన తెలిపారు. తాము జాతీయ రాజకీయాలపై చర్చించుకున్నట్లు ఆయన తెలిపారు. చంద్రబాబుతో తమ సంబంధాలు బాగానే ఉన్నాయని ఆయన చెప్పారు. సిపిఎం జాతీయ సమావేశాల్లో పాల్గొనడానికి కారత్ హైదరాబాద్ వచ్చారు. సోమవారం జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు.

కాగా, తెలంగాణపై ఎవరిని ప్రశ్నించాలో వారిని ప్రశ్నించాలని సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరి మీడియా ప్రతినిధులకు సూచించారు. తెలంగాణపై ఎవరు నిర్ణయం తీసుకోవాలో, ఎందుకు తీసుకోవడం లేదో వారినే అడగాలని ఆయన అన్నారు. కమ్యూనిస్టులంతా కలిసి పని చేయాలనే తాము కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. సీతారాం ఏచూరి సోమవారం ఉదయం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

English summary
CPM general secretary Prakash Karat met TDP president N Chandrababu Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X