నిద్రలేమితో భాదపడే సాప్ట్‌వేర్ ఇంజనీర్స్‌కు శుభవార్త

అలాంటి తీవ్ర నిద్రలేమితో బాధపడుతున్న వారు ఇక మాత్రల జోలికెళ్లే అవసరం ఎంతమాత్రం లేదంటున్నారు వైద్యులు. 'రాత్రి టోపీ'(నైట్ క్యాప్) ధరించడం ద్వారా సుఖమయ నిద్ర సొంతమవుతుందని చెబుతున్నారు. అమెరికా వైద్యుల బృందం అతిశీతలీకరించిన నీటి ట్యూబులతో ఓ టోపీని రూపొందించింది. దాన్ని ధరించడం ద్వారా మెదడు నరాలు చల్లబడి.. మంచి నిద్రపడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. మెదడులోని 'ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్' అనే భాగాన్ని చల్లబరచడం ద్వారా ప్రయోజనాలుంటాయని పిట్స్‌బర్గ్ వర్సిటీకి చెందిన ముఖ్యపరిశోధకుడు ఎరిక్ నోఫ్జింగర్ తెలిపారు.
అధ్యయనంలో భాగంగా నిద్రలేమితో బాధపడేవారిలో కొందరికి ఈ టోపీలు ధరింపజేసి.. మరికొందరిని మమూలుగా పరీక్షించామన్నారు. టోపీలు ధరించినవారు పడుకున్న సమయంలో 89 శాతం సమయం పూర్తిగా నిద్రలోనే ఉన్నారని తేలిందన్నారు. త్వరలోనే విస్తృత స్థాయి ప్రయోగాలు చేయనున్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications