హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మంత్రుల రాజీనామాలు కోరనున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి?

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గం రాజీనామా కోరే అవకాశం ఉందన్న ఊహాగానాలు సచివాలయంలో బుధవారం సాయంత్రం చెలరేగాయి. దీంతో పలువురు మంత్రుల పెషీ అధికారులు ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులకు ఫోన్ చేసి విషయాన్ని అడిగారు. అయితే ముఖ్యమంత్రి మంత్రివర్గం రాజీనామాలు కోరే అవకాశం లేదని సిఎం కార్యాలయం అధికారులు మంత్రుల పెషీ అధికారులకు చెప్పినట్లుగా తెలుస్తోంది. గురువారం మంత్రివర్గం సమావేశం ఉన్న విషయం తెలిసిందే. ఈ భేటీలో ముఖ్యమంత్రి మంత్రుల రాజీనామాపై ఏకవ్యాఖ్య తీర్మానం ప్రవేశ పెట్టి రాజీనామా కోరే అవకాశం ఉందన్న ఊహాగానాలు వచ్చాయి. అయితే రాజీనామాలు కోరరని రెగ్యులర్‌గా జరిగే అంశాలపైనే చర్చ జరుగుతుందని చెప్పారు. అయితే రాజీనామాల ఊహాగానాలపై మంత్రుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.

ఇటీవల చేనేత, జౌళి శాఖ మంత్రి శంకర్ రావు మంత్రివర్గంలో కొందరు అవినీతిపరులు ఉన్నారని ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. మంత్రులంతా సిఎంకు రాజీనామాలు సమర్పించాలని లేదా సిఎం మంత్రుల రాజీనామా కోరి అవినీతి మంత్రులపై వేటు వేయాలని డిమాండ్ చేశారు. ఇటీవల కాంగ్రెసులో పిఆర్పీ విలీనం అయింది. అంతేకాదు త్వరలో మంత్రివర్గం పునర్వ్యవస్థీకరణ కూడా జరుగుతుందనే వాదనలు కూడా వినిపించాయి. ఈ నేపథ్యంలో మంత్రుల రాజీనామా కోరే అవకాశం ఉందనే ఊహాగానాలకు తెరలేచింది. కాగా తెలంగాణ మంత్రులు ఢిల్లీ పర్యటనలో ఉన్నందున సమావేశాన్ని వాయిదా వేయాలని పలువురు కోరుతున్నారు.

English summary
The rumors were come that the CM Kiran Kumar Reddy will ask cabinet ministers resignations in tomorrow's cabinet meeting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X