నాగం జనార్దన్ రెడ్డిపై ధ్వజమెత్తిన టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి

నాగం జనార్దన్ రెడ్డి 1969లో తెలంగాణవాది, 2004లో సమైక్యావాది అయి, 2008లో తెలంగాణవాది ఎలా అయ్యారో చెప్పాలని ఆయన అన్నారు. తెలంగాణ అనుకూలంగా తమ పార్టీ ప్రణబ్ ముఖర్జీ కమిటీకి లేఖ ఇచ్చిందని, అఖిల పక్ష సమావేశంలోనూ అదే విషయం చెప్పిందని, శ్రీకృష్ణ కమిటీకి కూడా నివేదిక ఇచ్చిందని ఆయన చెప్పారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక సమర్పించిన తర్వాత ఏర్పాటైన అఖిల పక్ష సమావేశానికి వెళ్లకూడదని నాగం జనార్దన్ రెడ్డే చెప్పారని, ఆ మేరకే పార్టీ నిర్ణయం తీసుకుందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications