జగన్ వైపు వెళ్తున్నవారి వివరాలు ఇవ్వండి: మంత్రులకు సిఎం సూచన

Kiran Kumar Reddy
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వెంట వెళ్తున్నవారి వివరాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రులకు సూచించారు. గురువారం తన అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్ పార్టీ నుంచి వచ్చే విమర్శలకు దీటైన సమాధానం చెప్పాలని కూడా ఆయన సూచించారు. వైయస్ జగన్ పార్టీని ప్రతిపక్షంగానే చూడాలని, తమను విమర్శించే వారి పని పడదామని ఆయన అన్నారు. పార్టీ, ప్రభుత్వం కలిసి పనిచేస్తాయని, పార్టీ, ప్రభుత్వం వేరు వేరు కాదని నిరూపిద్దామని ఆయన అన్నారు.

పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో గానీ ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో గానీ తనకు ఏ విధమైన విభేదాలు లేవని ఆయన స్పష్టం చేశారు. మంత్రివర్గ సమావేశానికి బొత్స సత్యనారాయణ కూడా హాజరయ్యారు. అధికారులు మంత్రుల మాట వినిడం లేదని మంత్రి దానం నాగేందర్ ఫిర్యాదు చేశారు. అందుకే ఐఎఎస్ అధికారులను బదిలీ చేశామని ముఖ్యమంత్రి చెప్పారు. త్వరలో సహకార ఎన్నికలు నిర్వహించాలని మంత్రివర్గ సమావేశం అభిప్రాయపడింది.

స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయాన్ని హైకోర్టు తీర్పు వెలువడే దాకా వాయిదా వేయాలని మంత్రివర్గం అభిప్రాయపడింది. హైకోర్టు తీర్పు వెలువడిన తర్వాత అన్ని రాజకీయ పార్టీలతో చర్చించి తగిన నిర్ణయం తీసుకుందామనే నిర్ణయానికి వచ్చింది. బిసి రిజర్వేషన్ల విషయంలో వెనక్కి తగ్గేది లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+